- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Lokesh:16 వేల ఉద్యోగాల భర్తీ పై మంత్రి కీలక ప్రకటన
నిరుద్యోగులకు మంత్రి లోకేష్(Minister Lokesh) గుడ్ న్యూస్ చెప్పారు.

దిశ,వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు మంత్రి లోకేష్(Minister Lokesh) గుడ్ న్యూస్ చెప్పారు. ఈ రోజు(బుధవారం) అసెంబ్లీ సమావేశాల్లో(Assembly Meetings) ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉద్యోగాల భర్తీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్(Minister Lokesh) అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. 16 వేల పై చిలుకు పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) ఇస్తామని మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ప్రకటించారు. ఈ క్రమంలో ప్రశ్నోత్తరాల్లో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గతంలో టీడీపీ(TDP) అధికారంలో ఉన్నప్పుడు 11 డీఎస్సీ(DSC)ల ద్వారా 1.5 లక్షల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామని, అందులో 9 డీఎస్సీలు చంద్రబాబు(CM Chandrababu) హయాంలోనే నిర్వహించామన్నారు. మెగా డీఎస్సీ(Mega DSC) పైనే తొలి సంతకం పెట్టామని గుర్తు చేశారు. ఈ క్రమంలో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు తొలుత టెట్ నిర్వహించామని మంత్రి లోకేష్ తెలిపారు.






