జిల్లాల పునర్విభజనపై మంత్రులు ఫోకస్.. జిల్లాల టూర్ షెడ్యూల్ ఫిక్స్

by Vemula.Srinu Prasad |

జిల్లాల పునర్విభజన, మార్పుచేర్పులపై మంత్రులు ఫోకస్ పెంచారు..

జిల్లాల పునర్విభజనపై మంత్రులు ఫోకస్.. జిల్లాల టూర్ షెడ్యూల్ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: జిల్లాల పునర్విభజన(districts Reorganization), మార్పుచేర్పులపై ప్రభుత్వం కసరత్తులు పెంచిన విషయం తెలిసిందే. అయితే ప్రజల అభిప్రాయం, స్థానిక పరిస్థితులను తెలుసుకునేందుకు మంత్రులు 3 టీములుగా జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 29, 30న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గో. జిల్లాలు, అలాగే వచ్చే నెల 2న అల్లూరి జిల్లాలో మంత్రులు అనగాని, బీసీ జనార్థన్ రెడ్డి, అనిత పర్యటించనున్నారు. 29న ప.గో., కృష్ణా జిల్లాలు, 30న చిత్తూరు, కడప జిల్లాల్లో మంత్రులు నాదెండ్ల, నారాయణ పర్యటించనున్నారు. 30న ప్రకాశం, నెల్లూరు, వచ్చే నెల 2న గుంటూరు జిల్లాలో మంత్రులు నిమ్మల, సత్యకుమార్ పర్యటించనున్నారు.

Next Story