‘మంత్రి అవినీతి బట్టబయలు’.. ఇదేనా మంచి ప్రభుత్వం:YSRCP

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-19 13:44:16  IST  )

రాష్ట్రంలో ప్రభుత్వం పై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

‘మంత్రి అవినీతి బట్టబయలు’.. ఇదేనా మంచి ప్రభుత్వం:YSRCP
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పై వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. మంత్రి అవినీతి వ్యవహారం బట్టబయలైందంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ మేరకు ‘‘అవినీతికి సహకరించనందుకు ఏపీ ఆగ్రోస్ జీఎం రాజమోహన్ పై కక్షకట్టి, వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయమని ఒత్తిడి చేశారు. రాజమోహన్ సహకరించకపోవడంతో నెల్లూరుకు బదిలీ చేయించి, అర్హత లేని జూనియర్ అధికారిని నియమించారు. అవినీతికి సహకరించనని చెప్పినందుకు ఆగమేఘాలపై నెల్లూరుకి రాజమోహన్‌ను బదిలీ చేయించారని ఆరోపించింది. సెలవులకు వెళ్లడం తప్పా. మీ అడ్డగోలు దోపిడీకి సహకరించలేదని బదిలీల పేరుతో వేధిస్తారా? ఇదేనా మంచి ప్రభుత్వం’’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

Next Story