- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News:విద్యార్థులకు మంత్రి వాసంశెట్టి సుభాష్ కీలక సూచనలు
ఏపీ(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా దూసుకెళ్తోంది

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు(CM Chandrababu) పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యాభివృద్ధికి(Education Development) పెద్ద పీట వేసిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్(Minister Vasamsetti Subhash) పేర్కొన్నారు. ఇవాళ(బుధవారం) కృష్ణా జిల్లా పెనమలూరులో ఆర్ వి ఎస్ అనే విద్యానికేతన్‌లో ఆంగ్ల ఉన్నత పాఠశాలను మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి పాఠశాలకు(School), గ్రామానికి(Village), తల్లిదండ్రులకు(Parents), మంచి పేరు తేవాలని సూచించారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అలాగే ఆంగ్ల బోధన కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. కాబట్టి మాతృభాషతో పాటు ఆంగ్ల విద్యను కూడా అభ్యసిస్తే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు అన్నారు. కాబట్టి విద్యార్థులు(Students) క్రమశిక్షణతో విద్యాబుద్దులు నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఆర్టీసీ చైర్మన్(RTC Chairman) కొనకళ్ళ నారాయణరావు(Konakalla Narayana Rao), రాష్ట్ర బీసీ నాయకులు పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, బీసీ నాయకులు కే.బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.






