"గద్దముక్కు పంతులు".. కేసీఆర్ పై ఏపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శెట్టి బలిజలుగా పుట్టి కొంతమంది బంధువులు హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారని అన్నారు. ఆ టీఆర్ఎస్ గద్దముక్కు పంతులు శెట్టి బలిజలను ఓసీలలో చేర్చాడని వ్యాఖ్యానించారు.

గద్దముక్కు పంతులు.. కేసీఆర్ పై ఏపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శెట్టి బలిజలుగా పుట్టి కొంతమంది బంధువులు హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారని అన్నారు. ఆ టీఆర్ఎస్ గద్దముక్కు పంతులు శెట్టి బలిజలను ఓసీలలో చేర్చాడని వ్యాఖ్యానించారు. అలా ఓసీలలో కలపడం వల్ల వేల మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయని, భావితరాల వారి భవిష్యత్ లు పాడైపోతాయన్నారు. ఇక తాజాగా వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మంత్రి చేసిన వ్యాఖ్య‌లపై బీఆర్ఎస్ శ్రేణులు మండిప‌డుతున్నారు. మంత్రి హోదాలో ఉండి ఓ మాజీ సీఎంపై ఇలాగేనా మాట్లాడేది అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. video

Next Story