నేడు వడ్డమానులో రోడ్డును ప్రారంభించనున్న మంత్రి

by Thanuru Gopichand |

గ్రామస్తుల వినతి మేరకు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ వారం రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయించారు.

నేడు వడ్డమానులో రోడ్డును ప్రారంభించనున్న మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రామస్తుల వినతి మేరకు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ వారం రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయించారు. నేడు రోడ్డును అందుబాటులోకి తీసుకురానున్నారు. అందుకు సంబంధించిన ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలో ఉన్న వడ్డమానులో (Vaddamanu) రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Narayana) పర్యటించనున్నారు. రెండో విడత భూసేకరణలో భాగంగా గత బుధవారం మంత్రి వడ్డమానులో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే, సీఆర్డీఏ అడిషనల్ కమిషనరుతో కలిసి రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో భాగంగా భూసేకరణ విషయమై రైతుల అభిప్రాయాన్ని సేకరించారు. భూములిస్తే ఎన్ని రోజుల్లో అభివృద్ధి చేస్తారని.. రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తారని గ్రామస్తులు ప్రశ్నించారు. మూడేళ్లలో అభివృద్ధి చేసిస్తామని మంత్రి నారాయణ ఆ రోజు తెలిపారు. అదే సమయంలో గ్రామానికి రోడ్డు నిర్మాణం చేయాలని మంత్రిని గ్రామస్తులు కోరారు. వారి వినతి మేరకు వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేయించారు. నేడు రోడ్డును మంత్రి నారాయణ ప్రారంభించనున్నారు. మంత్రి వెంట తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, ప్రభుత్వాధికారులు ఉండనున్నారు.

Next Story