AP News:వైద్యులకు మంత్రి సత్యకుమార్ కీలక పిలుపు

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh) వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

AP News:వైద్యులకు మంత్రి సత్యకుమార్ కీలక పిలుపు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యాంధ్ర నిర్మాణంలో వైద్యులు భాగస్వామ్యం కావాలని వైద్య ఆరోగ్య మంత్రి సత్య కుమార్(Minister Satya Kumar) కోరారు. ప్రైవేటు వైద్యులు 15 రోజులకోసారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో పేదలకు మరింత మెరుగైన వైద్యం లభిస్తుందని చెప్పారు.

ప్రభుత్వాసుపత్రుల్లో గుండె చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒంగోలులో ఇటీవలే క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో 110 ఓపెన్ హార్ట్ సర్జరీలు, 3 హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడం అభినందనీయం. ఇటీవల ప్రభుత్వ వైద్యశాలలో 8శాతం ఓపీ, 17 శాతం ఐపీ సేవలు పెరగడం అభినందనీయమని, దీనిని మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ క్రమంలో యువతలో మానసిక వికాసానికి డాక్టర్లు ప్రధాన భూమిక పోషించాలి అని మంత్రి సత్య కుమార్ తెలిపారు.

Next Story