- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రజలు పట్టం కట్టిన పవిత్ర దినం.. ఈ రోజు: మంత్రి సత్యకుమార్
స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రజలు పట్టం కట్టిన పవిత్ర దినం అని మంత్రి సత్యకుమార్ తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: జూన్ 4, 2024 ఓ చారిత్రాత్మక దినమని మంత్రి సత్యకుమార్ యాదవ్(Minister Satyakumar Yadav) అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంతకుముందు ఐదేళ్ల పాలనలో చేసిన జగన్(Jagan) ఆరాచకాలను గుర్తు చేస్తూ విమర్శలు కురిపించారు. జగన్ అరాచకం, అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు మూకుమ్మడిగా తీర్పునిచ్చిన రోజు అని చెప్పారు. క్లుప్తంగా...అది ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగించిన ప్రజల మనోభావం వెల్లడైన రోజు అని చెప్పారు. ‘‘మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మానసికతకు వ్యతిరేకంగా ప్రజలు ఏకగ్రీవంగా గళమెత్తారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 1977లో దేశ ప్రజలు తిరగబడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న శుభదినం. రాజ్యాంగ ప్రసాదితమైన ప్రజల ప్రాథమిక హక్కులైన స్వేచ్చా స్వాతంత్య్రాలకు రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. అట్టి పవిత్ర దినాన్ని వెన్నుపోటు రోజుగా ప్రకటించిన జగన్.. రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానించారు. వైసీపీ వాళ్ల మానసిక వికారాన్ని మరోసారి వెల్లడించుకున్నారు. గతేడాది ఇదే రోజున ప్రజలిచ్చిన తీర్పునకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం సమగ్ర సంక్షేమాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తోంది. జగన్ మాత్రం తన వినాశకర అంతస్వరూపాన్ని మార్చుకునేది లేదని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారు. విచక్షణ లేకుండా తెనాలిలో రౌడీషీటర్లకు తన మద్దతును ప్రకటించి తన రూటు మారదని స్పష్టం చేసుకున్నారు. ప్రజలు ఈ వైఖరిని గమనించాలి. తగు జాగ్రత్తలో ఉండాలి. రాష్ట్రంలో మరోసారి అంధకారానికి ఏమాత్రం తావివ్వకూడదు.’’ అని ప్రజలకు మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు.






