- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పర్యాటకులపై కాల్పులు.. అత్యంత హేయమైన చర్య’: మంత్రి పార్థసారథి
జమ్మూ కాశ్మీర్‌లోని బైసరన్, పహల్గామ్, అనంత్‌నాగ్‌లలో అమాయక పర్యాటకులు, స్థానికులపై నిన్న(మంగళవారం) జరిగిన ఉగ్రదాడిని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తీవ్రంగా ఖండించారు.

దిశ,వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లోని బైసరన్, పహల్గామ్, అనంత్‌నాగ్‌లలో అమాయక పర్యాటకులు, స్థానికులపై నిన్న(మంగళవారం) జరిగిన ఉగ్రదాడిని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తీవ్రంగా ఖండించారు. దీనిని హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. 30 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న, అనేక మందిని గాయపరిచిన సంఘటన అనాగరిక చర్య అన్నారు.
మానవత్వం, శాంతి, కాశ్మీర్ ఆతిథ్య స్ఫూర్తి పై దాడిగా ఆయన పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అన్నారు. నాగరిక సమాజంలో ఎటువంటి హింసకు స్థానం లేదన్నారు. అత్యంత హేయమైన దాడికి పాల్పడిన హంతకులు, వెనుక ఉన్న వారిని న్యాయస్థానం ముందుకు తీసుకురావాలన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మరియు జమ్మూ కాశ్మీర్ ప్రజలతో సంఘీభావంగా భారత్ ఐక్యంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.






