చాలా బాధగా ఉంది: మంత్రి పార్థసారథి

by Vemula.Srinu Prasad |

వైసీపీ రాజకీయాలు చూస్తుంటే తనకు చాలా బాధగా ఉందని మంత్రి పార్థసారథి అన్నారు...

చాలా బాధగా ఉంది: మంత్రి పార్థసారథి
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcongress Party) నేతలు చేస్తున్న చిల్లర రాజకీయాలు చూస్తుంటే తనకు బాధగా ఉందని మంత్రి పార్థసారథి(Minister Parthasarathi) అన్నారు. వివిధ కేసుల్లో వైసీపీ నేతల అరెస్ట్‌లపై ఆ పార్టీ అధినేత చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కూటమి పాలనలో కక్ష సాధింపులు ఉండవని, కానీ వైఎస్ జగన్(Ys Jagan) మాత్రం సీఎం చంద్రబాబు(Cm Chandrababu)పై నోరు పారేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వాళ్లు కచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యల్లో రాక్షసానందం కనిపిస్తోందని మండిపడ్డారు. వైసీపీ ఓ రాజకీయ పార్టీ వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరని హెచ్చరించారు. హుందాగా రాజకీయాలు చేయాలని, విధ్వంసకరంగా ఉండకూడదని చెప్పారు. జగన్ హయాంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.

Next Story