వైసీపీ నేతలకు మంత్రి పార్థసారథి సంచలన సవాల్

by Jakkula.Mamatha |

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారిని మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు.

వైసీపీ నేతలకు మంత్రి పార్థసారథి సంచలన సవాల్
X

దిశ,వెబ్‌డెస్క్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారిని మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆశీర్వదించి, తీర్ధ ప్రసాధాలు, స్వామి వారి చిత్రపటాన్ని ఆలయ ఈవో అందజేశారు. మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలన పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో వైసీపీ నేతలకు మంత్రి పార్థసారథి సవాల్ విసిరారు. అభివృద్ధి, హామీల అమలుపై చర్చకు తాను సిద్ధం అని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 80 శాతం హామీలు అమలు చేశామన్నారు. హామీలు ఇచ్చి మోసం చేసిన జగన్‌ను ప్రజలు నిలదీయాలి. మాజీ సీఎం వైఎస్ జగన్ లాంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదని మంత్రి పార్థసారథి ఆరోపించారు.

Next Story