కాళేశ్వరానికి ఇచ్చినట్లే.. పోలవరం-నల్లమలసాగర్‌కు అనుమతి ఇవ్వాలి: నిమ్మల

by Ramesh Naini |

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నడుస్తున్న నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరానికి ఇచ్చినట్లే.. పోలవరం-నల్లమలసాగర్‌కు అనుమతి ఇవ్వాలి: నిమ్మల
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నడుస్తున్న నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం-నల్లమలసాగర్‌ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు అర్హత లేదని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై మంత్రి నిమ్మల స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరానికి ఇచ్చినట్లే పోలవరం-నల్లమలసాగర్‌కు అనుమతి ఇవ్వాలని నిమ్మల అన్నారు. పోలవరం దగ్గర వరద నీరు వాడుకోకుంటే నీళ్లన్నీ సముద్రంపాలే అవుతాయని అన్నారు. గోదావరిలో పుష్కలంగా నీరుందనే కాళేశ్వరానికి మేం అభ్యంతరం చెప్పలేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

Next Story