లండన్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన

by Ajay Maddhiboyina |

మంత్రి నారాయణ బృందం లండ‌న్ లో ప‌ర్య‌టిస్తోంది. ఈ సంద‌ర్భంగా లండ‌న్ న‌గ‌రానికి సంబంధించిన మాస్ట‌ర్ ప్లాన్, అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు, ర‌వాణా సౌక‌ర్యాల‌పై బృందం అధ్య‌య‌నం చేసింది.

లండన్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారాయణ బృందం లండ‌న్ లో ప‌ర్య‌టిస్తోంది. ఈ సంద‌ర్భంగా లండ‌న్ న‌గ‌రానికి సంబంధించిన మాస్ట‌ర్ ప్లాన్, అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు, ర‌వాణా సౌక‌ర్యాల‌పై బృందం అధ్య‌య‌నం చేసింది. సిటీ ఆఫ్ లండ‌న్ కార్పొరేష‌న్ ప్లానింగ్ అండ్ డెవ‌ల‌ప్మెంట్ డైరెక్ట‌ర్ గిన్ రిచ‌ర్డ్స్ తో స‌మావేశ‌మ‌వ్వ‌గా ఆయ‌న లండ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. అనంత‌రం మంత్రి బాట‌ర్సీ ప‌వ‌ర్ స్టేష‌న్ ను సంద‌ర్శించారు. అమ‌రావ‌తిలో ప‌ర్యాట‌క ప్రాజెక్టులు, రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధి, అంత‌ర్జాతీయ క్రీడా న‌గ‌రం నిర్మాణం కోసం ప‌లు ప్రాంతాల‌ను ప‌రిశీలించ‌డం ఈ ప‌ర్య‌ట‌న ముఖ్య ఉద్దేశం.

కాగా సోమ‌వారం బృందం లండ‌న్ చేరుకోగా.. మొద‌ట లండ‌న్ సిటీ మినియేచ‌ర్ ద్వారా న‌గ‌ర నిర్మాణ తీరును ప‌రీశించారు. అదే విధంగా బాట‌ర్సీ ప‌వ‌ర్ స్టేష‌న్ సందర్శించారు. ద‌శాబ్ద‌కాలం పాటు విద్యుత్ ఉత్ప‌త్తి చేసి మూత‌ప‌డిన ప‌వ‌ర్ స్టేష‌న్ ను ప్ర‌పంచ ప్ర‌సిద్ధ ప‌ర్యాట‌క కేంద్రంగా ఎలా అభివృద్ధి చేశార‌ని అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా థేమ్స్ న‌ది ఒడ్డున అత్యంత సుంద‌రంగా ఆహ్లాద‌క‌ర వాతావ‌రణంలో ఐకానిక్ భ‌వ‌నంతో పాటు ప‌ర్యాట‌కుల గ‌మ్య స్థానంగా బాట‌ర్సీ ప‌వ‌న్ స్టేష‌న్ ను తీర్చిదిద్దార‌ని మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. అమ‌రావ‌తిలో సైతం ప‌ర్యాట‌క ప్రాజెక్టులు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్నందున థేమ్స్ న‌ది రివ‌ర్ ఫ్రంట్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే అవ‌కాశాల‌పై సంబంధిత వ‌ర్గాల‌తో చ‌ర్చించారు.

Next Story