- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో గాలి కాలుష్యం.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
గాలి కాలుష్యం వల్ల ప్రతి ఏటా ప్రపంచంలో 70 లక్షల మంది చనిపోతున్నారని మంత్రి నారాయణ అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: గాలి కాలుష్యం(Air pollution) వల్ల ప్రతి ఏటా ప్రపంచంలో 70 లక్షల మంది చనిపోతున్నారని మంత్రి నారాయణ అన్నారు. విజయవాడ న్యూ ఆర్టీసీ కాలనీ(Vijayawada New RTC Colony)లో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామమోహన రావుతో కలిసి స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం(Golden Andhra - Clean Andhra Program)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ(Minister Narayana) మాట్లాడుతూ గాలి కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు,గుండె సంబంధిత రోగాలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. గాలి కాలుష్యం తగ్గింపునకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా రవాణాను ప్రోత్సహించాలని, చెట్లను నాటడంతో పాటు సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని నారాయణ సూచించారు.
రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఇంటింటికీ కుళాయి ద్వారా మంచి నీరు అందిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. సూపర్ జీఎస్టీ వల్ల రాష్ట్రానికి 8 వేల కోట్లు నష్టం జరుగుతున్నా ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘‘కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో డ్రింకింగ్ వాటర్, పారిశుధ్యం, డ్రైనేజీలు, రోడ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. సూపర్ జీఎస్టీ లో సోలార్ విద్యుత్ పై జీఎస్టీ భారీగా తగ్గించారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులకు రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం తో అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.’’ అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.






