- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడ్డమాను రైతులతో మంత్రి నారాయణ సమావేశం
అమరావతి (Amaravati) రాజధాని నిర్మాణంలో భాగంగా చేపట్టిన రెండో విడత భూ సమీకరణ అంశంపై చర్చించేందుకు పురపాలక శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) తుళ్లూరు మండలంలో కీలక పర్యటన చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : అమరావతి (Amaravati) రాజధాని నిర్మాణంలో భాగంగా చేపట్టిన రెండో విడత భూ సమీకరణ అంశంపై చర్చించేందుకు పురపాలక శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) తుళ్లూరు మండలంలో కీలక పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా వడ్డమాను గ్రామంలో రాజధాని రైతులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్, సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైల్వే ట్రాక్, నూతన రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీ వంటి ముఖ్యమైన మౌలిక వసతుల కల్పన కోసం రెండో విడతలో భూసమీకరణ చేపట్టనున్నట్లు మంత్రి నారాయణ రైతులకు వివరించారు. ఈ సందర్భంగా రాజధాని విస్తరణతో భవిష్యత్తులో ఈ ప్రాంతం ప్రపంచంలోనే అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చెందుతుందని, భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని ఆయన పునరుద్ఘాటించారు. రైతులకు గతంలో ఇచ్చిన హామీలు, కౌలు చెల్లింపులు, రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపులలో నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని మంత్రి హామీ ఇచ్చారు.
వడ్డమానులో 1,768 ఎకరాల భూ సమీకరణకు సన్నాహాలు
రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో భాగంగా వడ్డమాను గ్రామం నుంచి ప్రభుత్వం 1,768 ఎకరాల భూమిని సమీకరించనుంది. రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులందరికీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఇప్పటికే భూములు ఇచ్చిన 90 శాతం మంది రైతులకు ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, మిగిలిన వారి సమస్యలను, గ్రామ కంఠాలు, అసైన్డ్ భూముల వంటి చిక్కుముడులను నెల రోజుల్లో పరిష్కరించేందుకు ఉన్నత స్థాయి ఉపసంఘం కృషి చేస్తుందని మంత్రి ప్రకటించారు. సుమారు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని ఈ సమావేశంలో వివరించారు. రాజధాని అభివృద్ధి, విస్తరణకు రైతులంతా సహకరించాలని కోరారు. త్వరలో రెండో విడత భూ సమీకరణ నోటిఫికేషన్‌ను సీఆర్డీఏ విడుదల చేయనుంది.






