ఏపీ రాజధానిపై.. సజ్జలకు మంత్రి నారాయణ స్ట్రాంగ్ కౌంటర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-10 10:48:37  IST  )

తమకు రాజధాని అమరావతినేనని మంత్రి నారాయణ స్పష్టం చేశారు...

ఏపీ రాజధానిపై.. సజ్జలకు మంత్రి నారాయణ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని వైసీపీ ప్రభుత్వ మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారాయణ(Minister Narayana) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతి(Amaravati) రాజధాని 2014 నుంచే ప్రారంభం అయ్యిందని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్‌(Ys Jagan) రాజధానితో మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు వెళ్లి అమరావతి పనులు చూడండి ఎలా జరుగుతున్నాయోనని సజ్జలకు సలహా ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్లే రాజధాని నిర్మాణం ఆలస్యమైందమని మంత్రి నారాయణ తెలిపారు. తమకు ఏపీ రాజధాని అమరావతినేనన్నారు. వైసీపీ రాజధాని ఎక్కడో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సచివాలయంలో మంత్రులు, సెక్రటరీలు మాత్రమే ఉంటారని, హెచ్‌వోడీలు ఎక్కడో ఉంటారని తెలిపారు. అమరావతిలో నూతనంగా ఏర్పాటయ్యే సచివాలయంలో మంత్రుల నుంచి కిందస్థాయి సిబ్బంది వరకూ ఉంటారని నారాయణ తెలిపారు.

వైసీపీవి ఏవోవో మాటలు

రాజధాని నిర్మాణం ఆగదని తెలిసే స్కాములు అంటూ ఏవోవో మాటలు మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు. ప్రపంచంలో చాలా నగరాలు నదుల ఒడ్డేనే ఉన్నాయని, అవి ఎంతో అభివృద్ధి చెందాయని నారాయణ వ్యాఖ్యానించారు. రివర్ డెడ్‌, రివర్ బేసిన్‌కు తేడా తెలియని వ్యక్తి జగన్ అని విమర్శించారు. అమరావతి నదీ గర్భంలో ఉందనడం అవగాహన రాహిత్యమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నారని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

Next Story