Minister Narayana: రాజధాని విస్తరణపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

రాజధాని విస్తరణపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు..

Minister Narayana: రాజధాని విస్తరణపై మంత్రి నారాయణ కీలక ప్రకటన
X

దిశ, వెడ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Amaravati)ని విస్తరించాలని ప్రభుత్వం(Government) నిర్ణయించింది. మొత్తం 70 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు అసరమైన భూమిని రైతుల నుంచి సేకరించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే రైతుల అభిప్రాయాన్ని సేకరించింది. అమరావతి 29 గ్రామాల పరిధిలోనే కాక ప్రభుత్వ భూములను కూడా రాజధాని భూ సేకరణలో కలపనుంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి నారాయణ వెల్లడించారు.


ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానిని విస్తరించాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. ఇందుకోసం రెండోదశ భూసేకరణ చేపడతామని చెప్పారు. రైల్వే స్టేషన్, స్పోర్ట్స్, స్మార్ట్ సిటీలతో పాటు ఎయిర్ పోర్టు, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం 16,666 ఎకరాల భూములను రైతుల నుంచి సేకరిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఒలింపిక్స్ నిర్వహించేలా క్రీడానగరాన్ని సైతం నిర్మిస్తామని వెల్లడించారు. అలాగే అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషన్ స్పోర్స్ సిటీని నిర్మిస్తామని, అవసరమైతే కొంత ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Next Story