అలిగి ఇంట్లో పడుకోవద్దు: నేతలు, కార్యకర్తలకు లోకేశ్ సూచన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-05 12:43:30  IST  )

అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమేనని మంత్రి నారా లోకేశ్ సూచించారు...

అలిగి ఇంట్లో పడుకోవద్దు: నేతలు, కార్యకర్తలకు లోకేశ్ సూచన
X

దిశ, వెబ్ డెస్క్: అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమేనని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం(Palakonda Constituency) భామిని(Bhamini) కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పార్టీలో సంస్కరణల కోసం జగన్‌తో కంటే మూడు, నాలుగురెట్లు పోరాడానని తెలిపారు. సీఎం చందబాబు(Cm Chandrababu)ను ఒప్పించడం అంతతేలిక కాదని, అనుకున్నది సాధించేవరకు తాను వదలిపెట్టనని చెప్పారు. ఇది మన పార్టీ అని, మనం మాట్లాడుకొని చర్చించి సాధించుకోవాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గం, పార్లమెంటు, జోనల్ స్థాయిలో సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పారు. తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని తెలిపారు. పార్టీ బలోపేతంపై కలసికట్టుగా అందరం ముందుకెళ్లాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు వల్లే రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకుంటున్నామన్నారు. పవనన్న చెప్పినట్లుగా రాబోయే 15 ఏళ్లు మనం కలసి ఉండాలని ఆకాంక్షించారు. చిన్నచిన్న సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని మంత్రి లోకేశ్ పిలుపు నిచ్చారు.

Next Story