- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్దిరెడ్డి కంపెనీల్లోకి లిక్కర్ స్కామ్ డబ్బులు.. మంత్రి నారా లోకేశ్ సంచలన సవాల్
రాష్ట్రంలో జరిగిన లిక్కర్ కేసు పెను ప్రకంపనలను సృష్టిస్తోంది....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జరిగిన లిక్కర్ కేసు(Liquor Case) పెను ప్రకంపనలను సృష్టిస్తోంది. ఈ కేసులో వైసీపీ నేతలు వరుసగా జైలుకు వెళ్తుంటే అక్రమంగా కేసులు పెట్టారంటూ కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రి లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే తమ నేతలను అరెస్ట్ చేస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి(Former Minister Peddi Reddy ) కంపెనీలో లిక్కర్ ముడుపులు వెళ్లలేదా అని ప్రశ్నించారు. డబ్బులు తమ కంపెనీలోకి రాలేదని పెద్దిరెడ్డి చెప్పగలరా అని మంత్రి లోకేశ్ ఓపెన్‌గా సవాల్ విసిరారు. లిక్కర్ కేసులో పక్కాగా ఆధారాలున్నాయని చెప్పారు.పెద్దిరెడ్డి కంపెనీ పీఎల్ఆర్‌లోకి అదాన్ నుంచి డబ్బులు వెళ్లాయని లోకేశ్ వెల్లడించారు. రూ.400 కోట్ల బంగారం ఓ కంపెనీ కొనుగోలు చేసిందని, ఆ గోల్డ్ ఎక్కడికి వెళ్లిందో తేల్చాలని నారా లోకేశ్ ఛాలెంజ్ చేశారు.
దేశంలో ప్రజా స్వామ్యం ఉందని, ఎవరైనా ఎక్కడికైనా వెళ్లొచ్చని జగన్ నెల్లూరు పర్యటనపైనా అమరావతి నుంచి మంత్రి లోకేశ్ స్పందించారు. భద్రత ఇస్తే పోలీసులను పెట్టారని అంటారని, ఇవ్వకపోతే భద్రత లేదని వైసీపీ నేతలు రెండు మాటలు మాట్లాడతారని మండిపడ్డారు. భద్రత ఇవ్వకపోతే కారులతో మనుషులను తొక్కి చంపుతున్నారని ఆరోపించారు. భద్రత కల్పించి మరీ జగన్ పర్యటనలకు అనుమతులు ఇస్తున్నామని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) కంటే ఎక్కువ భద్రత జగన్‌కు కల్పిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.






