అమెరికా, కెనడా టూర్‌కు నారా లోకేశ్.. ఐదు రోజుల షెడ్యూల్ ఇదే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-05 16:38:26  IST  )

ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ అమెరికా, కెనడా టూర్‌కు వెళ్తున్నారు...

అమెరికా, కెనడా టూర్‌కు నారా లోకేశ్.. ఐదు రోజుల షెడ్యూల్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ అమెరికా, కెనడా టూర్‌కు వెళ్తున్నారు. శనివారం ఉదయం ఆయన గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. ఈనెల 10వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఆయన అమెరికా, కెనడాలో విస్తృతంగా పర్యటించనున్నారు. తొలిరోజు డల్లాస్‌లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొననున్నారు. 8,9 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. 10న కెనడాలోని టొరంటోలో పర్యటిస్తారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలను వివరించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేశ్ అమెరికాలో పర్యటించడం ఇది రెండోసారి. పెట్టుబడుల సాధన కోసం గత 18 నెలల్లో మంత్రి లోకేశ్ అమెరికా, దావోస్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు.

Next Story