మంత్రి లోకేశ్ సంచలన నిర్ణయం.. త్వరలో రూట్ మ్యాప్ ఖరారు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-19 13:03:13  IST  )

ప్రజా సేవలో మంత్రి నారా లోకేశ్ తనదైన శైలిలో వినూత్నంగా దూసుకుపోతున్నారు..

మంత్రి లోకేశ్ సంచలన నిర్ణయం.. త్వరలో రూట్ మ్యాప్ ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజా సేవలో మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) తనదైన శైలిలో వినూత్నంగా దూసుకుపోతున్నారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తన కార్యాలయం వద్దకు వచ్చిన విజ్ఞప్తులు, అర్జీలే కాకుండా స్థానికంగా ఉన్న సమస్యలపైనా ఆయన ఆరా తీయాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు అక్కడికక్కడే పరిష్కారం చూపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా జనాల్లోకి వెళ్లేందుకు నారా లోకేశ్ రెడీ అయ్యారు. మహానాడు(Mahanadu)లోపు కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఈ పర్యటనలో స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు త్వరలోనే రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు.

Next Story