- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సౌండ్ బాక్సులు బద్దలే..! అఖండ 2 సినిమాపై మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్
by Ramesh Naini |
‘అఖండ 2’ (Akhanda 2) శుక్రవారం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ నటుడు బాలకృష్ణ (Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ 2’ (Akhanda 2) శుక్రవారం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అఖండ 2 సినిమాలో బాల మామయ్య నట తాండవం ప్రేక్షకులకు కనువిందు చేయనుందని తెలిపారు. God of Masses మూవీ అంటే సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయ నినాదం అని కొనియాడారు. #Akhanda2 అఖండ-2 అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఐదు దశాబ్దాల సినీ చరిత్రలో మరో ఘన విజయం సొంతం చేసుకోబోతున్న బాల మామయ్యకు అభినందనలు.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు.. అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా, అఖండ-2 ఈ నెల 5న విడుదల కావలసి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడి డిసెంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్వీట్ ఇదే..
Next Story






