- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలా జరగదు: మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని మంత్రి నారా లోకేశ్ తేల్చిచెప్పారు...

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ప్రైవేటీకరణ జరగదని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) తేల్చిచెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాబోతోందంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, నిరసనలపై శాసనమండలి(Legislative Council) వేదికగా ఆయన స్పందించారు. స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ(Ysp) దుష్ప్రచారం చేస్తోందని లోకేశ్ మండిపడ్డారు. తమ ఎమ్మెల్సీ వరుదు కల్యాణిని అవమానించారంటూ ఎమ్మెల్సీ బొత్స చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ(Tdp) ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తన తల్లిని అసెంబ్లీలో అవమానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తల్లిని అవమానిస్తే ఆ బాధ ఎలా ఉంటదో తనక బాగా తెలుసని చెప్పారు. ఇక అవమానానికి గురైన తన తల్లి ఆ బాధ నుంచి కోలుకోవడానికి రెండు నెలలు పట్టిందని తెలిపారు. తమ మహిళా నేతలపై కేసులు పెట్టిన వైసీపీ వాళ్లు ఏం చేశారని లోకేశ్ ప్రశ్నించారు. ఇప్పటికి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలను అవమానిస్తూ దారుణంగా మాట్లాడుతున్నారని, అలాంటి వారికి గౌరవం గురించి మాట్లాడే హక్కు లేదని మంత్రి లోకేశ్ మండిపడ్డారు






