- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ స్కూల్లో అడ్మిషన్లు క్లోజ్: మంత్రి నారాయణను ప్రశంసిన నారా లోకేశ్
నెల్లూరు వీఆర్ స్కూల్లో అడ్మిషన్లు క్లోజ్ కావడంపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు..

దిశ, వెబ్ డెస్క్: గత ఐదేళ్ల కాలం మొత్తం ఆ స్కూలు మూసివేత. ఇప్పుడు కొత్త కళను సంతరించుకుంది. ఫలితంగా అడ్మిషన్లు క్లోజ్ అయ్యాయి. దీంతో మంత్రి నారా లోకేశ్(Minister Lokesh) స్పందించారు. మంత్రి నారాయణ(Minister Narayana)ను ప్రశంసించారు. అది ఏ స్కూలో కాదు. మంత్రి నారాయణ స్వయంగా చదువుకున్న స్కూలు. నెల్లూరు వీఆర్ స్కూలు(Nellore VR School) అంటే రాష్ట్రమంతటా పేరుంది. ఈ స్కూలుకు రెండున్నర శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ స్కూల్లో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకున్న విద్యార్థుల్లో మంత్రి నారాయణ కూడా ఒకరు. మంత్రి నారాయణ తన చిన్నతనంలో వీఆర్ స్కూల్లోనే చదువుకున్నారు. ఆ తర్వాత పెరిగి పెద్ద అయి.. ముఖ్యమంత్రి కేబినెట్‌లో మంత్రి స్థాయికి చేరుకున్నారు. అంతేకాదు ఏపీ, తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థలు నడుపుతూ ప్రముఖుడిగా పేరు తెచ్చుకున్నారు.
అయితే గత ఐదేళ్లపాటు ఈ స్కూలును మూసివేశారు. మంత్రి నారాయణ చదువుకున్న కారణంతోనో.. మరేదైనా సంఘటనతోనే గత ఐదేళ్ల పాటు ఈ స్కూలు అభివృద్ధికి నోచుకోలేదు. పైగా స్కూలును మూసివేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, మరోసారి నారాయణ మంత్రి కావడంతో నెల్లూరు వీఆర్ స్కూలు కొత్త కళను సంతరించింది. స్కూలును అభివృద్ధి చేసి మళ్లీ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ స్కూలును అభివృద్ధి చేసేందుకు మంత్రి నారాయణ కుమార్తెలు ముందుకు వచ్చారు. విద్యార్థులకు ఫ్రీ బస్సు, సైకిళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే నాలుగు స్కూలు యూనిఫాములు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఫ్యాకల్టీ విషయంలోనూ భరోసా ఇచ్చారు. దీంతో పేద విద్యార్థులు ఈ స్కూల్లో చదువుకునేందుకు భారీగా ముందుకు వచ్చారు. ఫలితంగా ఈ స్కూలు అడ్మిషన్లు క్లోజ్ అయ్యాయి. ఈ విషయం మంత్రి లోకేశ్ కు తెలియడంతో హర్షం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి నారాయణకు ఫోన్ చేసి అభినందనలు, ప్రశంసలు కురిపించారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం నారాయణ చేసిన సేవలను మెచ్చుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.






