ఆయనకు క్రెడిట్ చోరీ జబ్బుంది.. తిప్పికొట్టండి: నేతలకు లోకేశ్ పిలుపు

by Vemula.Srinu Prasad |

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి క్రెడిట్ చోరీ జబ్బుందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. పార్టీ బలోపేతంపై పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.....

ఆయనకు క్రెడిట్ చోరీ జబ్బుంది.. తిప్పికొట్టండి: నేతలకు లోకేశ్ పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy)కి క్రెడిట్ చోరీ జబ్బుందని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) విమర్శించారు. టీటీడీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌(TTD National Working President)గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. పార్టీ బలోపేతంపై పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సినిమా విధ్వంసమని, తెలుగుదేశం పార్టీ సినిమా అభివృద్ది అని వ్యాఖ్యానించారు. వైసీపీకి ఎండ్ కార్డు వేసేదే పసుపు సైన్యమేనని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సమస్యను పరిష్కరించుకున్నామన్నారు. గత ప్రభుత్వం నిలిపివేసిన అమరావతి పనులను వేగవంతం చేశామని లోకేశ్ గుర్తు చేశారు.

సూపర్ సిక్స్ అమలు చేయాలి

రాష్ట్రానికి 800 కంపెనీలు తీసుకొచ్చామని, మహానాడు సూపర్ సిక్స్ ప్రకటించామని, వాటిని అమలు చేయాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి నేతలు శాశ్వతం కాదని, పార్టీ శాశ్వతమని చెప్పారు. అధికారం ఉందని అహంకారం పెరిగితే 2024 ఎన్నికల్లో ఏం జరిగిందో అందరం చూశామన్నారు. విభేదాలను మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు. గుజరాత్‌లో స్థిరమైన ప్రభుత్వం ఉందని, అందువల్లే అక్కడ అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. సాధారణ కార్యకర్త కూడా కష్టపని చేస్తే పొలిట్ బ్యూరోలోకి ఆహ్వానిస్తామని లోకేశ్ పేర్కొన్నారు.

Next Story