క్యాంప్ సైట్ లోనూ ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్

by Thanuru Gopichand |

రాష్ట్ర ప్రజల సమస్యలనే తన సమస్యలుగా భావిస్తుంటారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh).

క్యాంప్ సైట్ లోనూ ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రజల సమస్యలనే తన సమస్యలుగా భావిస్తుంటారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh). అందుకే రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తెలుసుకోవడమే కాకుండా సంబంధిత అధికారులతో సమస్యపై చర్చిస్తారు. ఆ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను గురించి తెలియజేస్తారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫాలోఅప్ కూడా చేస్తారు. అందుకు నిదర్శనంగా పుట్టపర్తి శత జయంతి వేడుకలకు హాజరైనా కూడా.. తన క్యాంప్ సైట్ లో ప్రజాదర్బార్ నిర్వహించారు మంత్రి నారా లోకేష్. 74వ రోజు ప్రజాదర్బార్ (Praja Darbar) నిర్వహించగా ఆయనను కలిసేందుకు సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు క్యాంప్ సైట్ కు తరలివచ్చారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి తన వద్దకు వచ్చిన వారిని మంత్రి లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. ఒక్కొక్కరితో ప్రత్యక్షంగా మాట్లాడుతూ వారి వినతులను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి మంత్రి హామీనివ్వడం పట్ల ప్రజలు, టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Next Story