Nadendla Manohar: మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల

by Thanuru Gopichand |

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు సహాయం అందించి ఏపీ మంత్రి మానవత్వాన్ని చాటుకున్నారు

Nadendla Manohar: మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు సహాయం అందించి ఏపీ మంత్రి మానవత్వాన్ని (Humanity) చాటుకున్నారు. విజయవాడ నుంచి కాకినాడ వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, భీమడోలు సమీపంలోని ఎం. నాగులపల్లి అడ్డరోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని (Road accident) చూసి ఆగారు. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఇన్నోవా కారు ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని గమనించారు. ప్రమాదాన్ని గమనించిన మంత్రి వెంటనే తన వాహనం ఆపి గాయపడిన వ్యక్తులకు సహాయం అందించారు. అంబులెన్స్‌ కు కాల్ చేసి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, తన కాన్వాయ్‌లోని ప్రోటోకాల్ వాహనాన్ని అంబులెన్స్‌కు ఎస్కార్ట్ వాహనంగా ఉపయోగించి వేగంగా ఆసుపత్రికి చేరేలా చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీకి స్వయంగా ఫోన్ చేసి గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Next Story