- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nadendla Manohar : మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్
ఏపీ కూటమి ప్రభుత్వపు మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ కూటమి ప్రభుత్వపు మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన దయా గుణంతో రోడ్డు ప్రమాద బాధితుణ్ణి కాపాడి, ఆసుపత్రికి చేర్చారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే ఏలూరు జిల్లా భీమడోలు వద్ద కారు, బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి ఆక్సిడెంట్ ను గమనించి.. తన కాన్వాయ్ ని ఆపి దిగారు. స్వయంగా అంబులెన్స్ కు ఫోన్ చేసి రప్పించి, బాధితుణ్ణి ఆసుపత్రికి పంపించారు. అంతటితో ఊరుకోకుండా జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి.. క్షతగాత్రునికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, బాధితుని ఆరోగ్యం వివరాల గురించి తనకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఎంతో బిజీగా ఉండే మంత్రి స్వయంగా రోడ్డు ప్రమాద బాధితునికి సహాయం అందించడమే కాకుండా.. అధికారులను పురమాయించడంపై నాదెండ్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది.






