- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెనాలి అభివృద్ధిపై మంత్రి నాదెండ్ల ఫోకస్... అధికారులకు కీలక ఆదేశాలు
తెనాలి అభివృద్ధిపై అధికారులకు మంత్రి నాదెండ్ల కీలక ఆదేశాలు జారీ చేశారు..

దిశ, ఏపీ బ్యూరో/అమరావతి: ప్రపంచ దేశాలకు పెను సవాలుగా నిలిచిన పేదరికాన్ని తరిమికొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూపొందించిన సమగ్ర విధానం "పీ4 – పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం" అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సచివాలయంలో తెనాలి విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశం జరిగింది. అనంతరం పీ4 పోస్టర్‌ను అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో పూర్తి వివరాలతో.(www.zeropovertyp4.ap.gov.in) వెబ్సైట్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎన్నారైలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న తెనాలి వాసుల సహకారం తీసుకుంటూ, వారిని భాగస్వాములుగా మార్చే ప్రణాళిక చేపడుతున్నట్లు తెలిపారు. దీంతో ఎక్కువ మంది మహిళలు యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. 2047 విజన్‌లో భాగంగా 2029 నాటికి 50 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి అభివృద్ధి వైపు నడిపించేందుకు కూటమి ప్రభుత్వం రూపొందించిన బృహత్తర కార్యక్రమం అన్నారు.
పేదల సంక్షేమం, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి, వారికి అవసరమైన మద్దతు కల్పించడం జరుగుతుందన్నారు. నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చడమే పీ4 ముఖ్య ఉద్దేశమనన్నారు. తెనాలి నియోజకవర్గంలో సుమారు 14280 బంగారు కుటుంబా లను ఇప్పటికే గుర్తించామని వారికి అండగా నిలిచేందుకు 376 మంది ముందుకు వచ్చారన్నారు. వీరు దాదాపు 3289 మందిని దత్తత తీసుకున్నారు.. డేటా వెరిఫికేషన్ అనంతరం వీరి సహాయంతో వారికి ఉపాధి, చదు. వులకు తోడ్పాటు, వ్యవసాయ సాగు మార్కెటింగ్, బ్యాంకు రుణాలు ఇప్పించడం, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వైద్య సహాయం తదితర అంశాల్లో సహాయం అందించడం జరుగుతుందన్నారు. త్వరలో మార్గదర్శకులతో పరిచయ కార్యక్రమం తెనాలిలో నిర్వహిస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఈ యాక్షన్ ప్లాన్ తెనాలి నియోజకవర్గానికి ఒక రోడ్ మ్యాప్ లా మారుతుందన్నారు.
ఈ సమావేశంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ, తెనాలి ఎమ్మార్వో గోపాలకృష్ణ, కొల్లిపర ఎమ్మార్వో జి సిద్ధార్థ, తెనాలి ఎంపీడీవో దీప్తి, ఎంపీడీవో కొల్లిపర విజయలక్ష్మి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మీపతిరావు, సహాయ గణాంక అధికారి మహిళా పోలీసులు, స్వర్ణాంధ్రవిజన్ మేనేజ్మెంట్ యూనిట్ అధికారి తదితరులు పాల్గొన్నారు.






