- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాజువాక ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా
by Naga Rani Yarlagadda |
గాజువాక ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి చెందారు. ప్రమాదంలో మరణించినవారికి సంతాపం ప్రకటించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ జిల్లా గాజువాకలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. ఏడుగురు గాయపడ్డారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల్ని ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడినవారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారుల్ని ఆదేశించారు. కాగా.. బాధిత కుటుంబాలకు ఆర్టీసీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే ఆర్టీసీ నుంచి కూడా పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని.. అధికారులకు మండిపల్లి ఆదేశాలు ఇచ్చారు.
Next Story






