Nara Lokesh:తల్లికి వందనం.. ఇలా చేస్తే అకౌంట్‌లో డబ్బులు పడతాయ్!

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-13 12:41:14  IST  )

ఏపీలో ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది

Nara Lokesh:తల్లికి వందనం.. ఇలా చేస్తే అకౌంట్‌లో డబ్బులు పడతాయ్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా నిన్న(గురువారం)టి నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 35,44,459 మంది అకౌంట్ లో నిధులు జమ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో విద్యార్థికి రూ.15వేల చొప్పున డబ్బులు విడుదల చేస్తోంది. ఇందులో 13వేలు లబ్ధిదారుల ఖాతాలకు, 2వేలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ల ఖాతాలకు జమ చేస్తున్నారు.

ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ(శుక్రవారం) విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని అన్నారు. ఈ తరుణంలో ఎన్నడూ లేని విధంగా స్కూల్స్ రీఓపెన్ రోజే పుస్తకాలు, యూనిఫామ్ ఇచ్చామని మంత్రి లోకేష్ వెల్లడించారు. మిగిలిన కొన్ని స్కూల్స్‌కు ఈ నెల 20లోగా బుక్స్ యూనిఫామ్ అందిస్తామన్నారు. 80 శాతం మంది పిల్లలకు స్కూల్ కిట్లు అందించామని అన్నారు. వన్ క్లాస్, వన్ టీచర్ విధానాన్ని 1200 నుంచి 9600 స్కూల్స్ కు పెంచామని చెప్పారు. అలాగే, అన్ని పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించనున్నామని మంత్రి తెలిపారు. అలాగే, మంత్రి నాదెండ్ల మనోహర్‌తో మాట్లాడి మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి లోకేష్ వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం పై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హులందరికీ తల్లికి వందనం డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. ఎంత మంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 42 లక్షల మంది పిల్లలకే అమ్మఒడి ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం ఇస్తున్నామని చెప్పారు. అయితే.. తల్లికి వందనం లబ్దిదారులలో కొంతమంది అకౌంట్‌లు యాక్టివేట్ లేక నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చాయి. అలాంటి తల్లులు బ్యాంకులకు వెళ్లి వెంటనే ఖాతాలు యాక్టివేట్ చేసుకుంటే డబ్బులు పడతాయి అని లోకేష్ సూచించారు.

Next Story