- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిహార్ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న మంత్రి లోకేష్
బిహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది.

దిశ, వెబ్ డెస్క్ : బిహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఆయా పార్టీల భాగస్వామ్య పక్షాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మలి విడత ఎన్నికల కోసం ఆయుధాలకు పదును పెడుతున్నాయి. అందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ నేతలను తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారానికి ఆహ్వానిస్తున్నాయి. స్టార్ క్యాంపెయినర్లుగా, భాషాపరమైన ఓటర్లను ఆకర్షించే వారిగా వారిని రంగంలోకి దింపుతున్నాయి. అదే విధంగా ఎన్డీఏ (NDA) పక్షాలు అయిన జేడీయు (JDU), బిజెపిలకు (BJP) మద్ధతుగా టీడీపీ (TDP) కూడా బిహార్ ఎన్నికల ప్రచార బరిలోకి దిగింది.
ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) బిహార్ లోని పాట్నాకు నేడు వెళ్లనున్నారు. ఎన్డీఏ తరపున లోకేష్ పాట్నాలో ప్రచారం నిర్వహిస్తారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా టీడీపీ ప్రభుత్వ విజయాలను లోకేష్ ప్రచారం చేయనున్నారు. అంతేకాకుండా నేడు సాయంత్రం 6 గంటలకు బిహార్ చాంబర్ ఆఫ్ కామర్స్ (Bihar Chamber Of Commerce) సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం 7.30 గంటలకు బిహార్ పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశమవుతారు. నవంబరు 9 ఉదయం 10 గంటలకు పాట్నాలో ఎన్డీఏకు మద్ధతుగా నారా లోకేష్ ప్రెస్ మీట్ (Press Meet) నిర్వహించనున్నారు.






