- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరకా ‘మనీ దొంగ’ వెనుక వైసీపీ నేతలు.. మంత్రి లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
పరకా ‘మనీ దొంగ’ వెనుక వైసీపీ నేతలు ఉన్నారని మంత్రి లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు....

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్(Ys Jagan) ఐదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలిందని, అరాచకం పెచ్చరిల్లిందని మంత్రి నారా లోకేశ్(Minsiter Nara Lokesh) అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరకామనీ(Parakamani)లో జరిగిన అక్రమాలపై ఆయన మండిపడ్డారు. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీ(Ap)ని కేరాఫ్ అడ్రస్ చేశారని వ్యాఖ్యానించారు. గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు జనాన్ని కూడా జగన్ గ్యాంగ్ దోచుకుందని ఆరోపించారు. చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ వదలలేదని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Former TTD Chairman Bhumana Karunakar Reddy) అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారని చెప్పారు. కోట్ల సొత్తు కొల్లగొట్టారని ఆరోపించారు. ఆ డబ్బు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారని, ఇందులో వాటాలను తిరుపతిలో భూమన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు అందాయని నిందితులే చెబుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు.
‘‘ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో నమ్మకంతో కట్టిన ముడుపులు, హుండీలో వేసిన కానుకలు రవికుమార్ దోచుకున్నారు. ఆ సమయంలో టిటిడి చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన మనుషులు ఈ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేయడానికి ప్రయత్నించారు. అధికారం అండతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదు. భక్తులు మహా ప్రసాదంగా భావించే లడ్డూని కల్తీ చేశారు. అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు. తిరుమల దర్శనాలను అమ్మేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దుర్లభం చేశారు. ఏడుకొండల జోలికి వెళ్ళవద్దు, శ్రీవారికి అపచారం తలపెట్టవద్దు అని.. నాడు జగన్మోహన్ రెడ్డికి బతిమాలి చెప్పారు చంద్రబాబు.. అయినా వినలేదు. ఏడుకొండలవాడు చాలా పవర్ ఫుల్ సామీ.. ఆయనకు అపచారం తలపెట్టినా, ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడినా.. ఏం జరుగుతుందో తెలిసినా జగన్, భూమన ఏకంగా పరకామణినే దోచేశారు. గుడి, గుడిలో హుండీని దోచేసిన పాపాల గత పాలకుడు జగన్ గ్యాంగ్ పాపం పండింది. పరకామణి వీడియోలు ఈరోజు బయటపడ్డాయి. నిందితులే రేపు వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారు.’’ అని మంత్రి లోకేశ్ తెలిపారు.






