- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nara Lokesh:‘తల్లికి వందనం’ పై ఆరోపణలు.. మంత్రి లోకేష్ క్లారిటీ
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవల తల్లికి వందనం పథకం అమలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలో అభివృద్ధి జరుగుతుంటే వైసీపీ(YSRCP) ఓర్వలేక పోతుందని ఏపీ(Andhra Pradesh) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) విమర్శలు గుప్పించారు.
తల్లికి వందనం(Talliki vandhanam)లో ఒకే ఆధార్‌తో వందల మంది లబ్ధిదారులంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఈ తరుణంలో తల్లికి వందనం సూపర్ సక్సెస్ అయిందని తల్లుల కళ్లలో ఆనందం చూసి వైఎస్ జగన్(Former CM YS jagan) కడుపు మంట మూడింతలు పెరిగిందని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో మరోసారి మాజీ సీఎం జగన్ ఫేక్ ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదని నారా లోకేష్ వెల్లడించారు.
గ్రామ సచివాలయం, లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయని మంత్రి తేల్చి చెప్పారు. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ అంటూ గత ప్రభుత్వం పై మంత్రి లోకేష్ ఫైరయ్యారు. మీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలే అందరూ చేస్తారు అనుకుంటే ఎలా? అని దుయ్యబట్టారు. ‘‘మాది ప్రజా ప్రభుత్వం తప్పు చేయం.. చెయ్యనివ్వం’’ అని మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.






