- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Kollu Ravindra: రూ.10 లక్షల ఆర్ధిక సాయం
పవిత్ర కార్తీక మాసంలో నిర్వహించే వన సమారాధనల్లో పాల్గొనడం అత్యంత సంతోషకరంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు...

దిశ, వెబ్ డెస్క్: పవిత్ర కార్తీక మాసంలో నిర్వహించే వన సమారాధనల్లో పాల్గొనడం అత్యంత సంతోషకరంగా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన పలు వన సమారాధనల్లో పాల్గొన్నారు. కొండపల్లి ఎస్టేట్‌లో నిర్వహించిన కాపు సామాజిక వర్గీయుల ఆత్మీయ వేడుకలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో కాపు కల్యాణ మండపం నిర్మాణానికి తన వంతుగా రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. టీటీడీ కల్యాణ మండపంలో యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన సమారాధన వేడుకల్లో కొలుసు పార్ధసారధితో కలిసి పాల్గొన్నారు. గోకవరంలో ఆర్యవైశ్య వర్గీయుల వన సమారాధనల్లో పాల్గొన్నారు.
వన సమారాధనల నిర్వహణతో సామాజిక సమస్యలపై చర్చ అభినందనీయం అన్నారు. ‘మానవ సంబంధాలు బలోపేతం కావడానికి ఇలాంటి వన సమారాధనలు కీలకంగా నిలుస్తాయి. నియోజకవర్గంలోని ప్రతి వర్గానికీ అండగా నిలుస్తాను. త్వరలోనే బందరు పోర్టును పూర్తి చేసుకుంటాం. స్థానికంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. అదే సమయంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి యువత భవితకు బాటలు వేయబోతున్నాం.’’ అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.






