పదవులు అలంకారప్రాయం కాదు: మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

పదవులు అలంకారప్రాయం కాదనే విషయాన్ని ప్రతి కార్యకర్త దృష్టిలో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు..

పదవులు అలంకారప్రాయం కాదు: మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పదవులు అలంకారప్రాయం కాదనే విషయాన్ని ప్రతి కార్యకర్త దృష్టిలో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం(Vijayawada Tummalapalle Art Centre)లో ఆఫ్కాఫ్ చైర్మన్, పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీ(B.C) నాయకత్వానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. పదవి తీసుకున్న ప్రతి ఒక్కరూ తమ సమాజ అభివృద్ధి కోసం పని చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు బలంగా వినిపించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. జీవో 217 విషయంలో మనం చేసిన పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. ప్రజల హక్కులు కాలరాస్తమంటే చూస్తూ ఊరుకునేది లేదని మన సత్తా ఏంటో చాటి చెప్పామని పేర్కొన్నారు. మన పోరాటాన్ని, రాష్ట్రంలో బీసీ నాయకత్వాన్నీ అణచివేయడం కోసం తప్పుడు కేసులు, అరెస్టులు చేశారని గుర్తు చేశారు. అయినా వెనకడుగు వేయకుండా పోరాటం చేశామని, హక్కులు కాపాడుకున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

ఆది నుంచి కూడా...

‘‘బీసీ వర్గాలకు ఆది నుంచి అండగా నిలిచింది టీడీపీ మాత్రమే. బీసీలకు సంక్షేమం, అభివృద్ధి, రాజ్యాధికారం కల్పించింది టీ కూడా డీపీనే. మత్స్యకారులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ప్రకటించిన ఘనత చంద్రబాబుదే. మత్స్యకార వర్గాలకు తొలిసారి డీజిల్ సబ్సిడీ, వేట నిషేధ భృతి టీడీపీ ఘనత అని గర్వంగా చెప్తున్నా. బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి భారీగా నిధులు కేటాయిస్తున్నాం.’’ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Next Story