నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే నాలిక చీరుతా..మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని తనపై చేస్తున్న ఆరోపణలపై మీడియా సమావేశం నిర్వహించారు.

నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే నాలిక చీరుతా..మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని తనపై చేస్తున్న ఆరోపణలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. తాము రామాలయం నిర్మించాలని కమిటీగా ఏర్పడి తీర్మాణం చేసుకుంటే దాని మీద కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజారథ్నపురంలో తన అన్న కొడుకు ఐస్ ఫ్యాక్టరీ నడుపుతుంటే దాని పై కూడా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

తన తాత, నాన అక్కడ రైస్ మిల్ ప్రారంభించి, తరవాత ఐస్ ఫ్యాక్టరీ చేశారన్నారు. కానీ అక్కడేదో రైతుల పొలాలు లాక్కుని చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మతిస్థిమితం కోల్పోయి ఏదో ఒకటి మాట్లాడాలని చూస్తున్నారన్నారు. మరోసారి తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే నాలుక చీరేస్తేనని వార్నింగ్ ఇచ్చారు. ఇంటికి వస్తే భోజనం పెడతామని అది కూడా తప్పేనా అని ప్రశ్నించారు. తన కొడుకు మచిలీపట్నంలో ఇండస్ట్రీ పెట్టుకుని పదిమందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. మీకు లాగా గంజాయి వ్యాపారం ప్రారంభించి ఆంబోతులా రోడ్డుమీద తిరగడం లేదంటూ ఫైర్ అయ్యారు.

Next Story