- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోజాకు పవన్‌ను విమర్శించే అర్హత లేదు: మంత్రి కందుల దుర్గేష్
by Ajay Maddhiboyina |
పాలనను గాలికొదిలేసి పవన్ కల్యాణ్ ప్రజాధనంతో సినిమాలు, షూటింగులు అంటూ తిరుగుతన్నాడని వైసీపీ నేత రోజా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్: పాలనను గాలికొదిలేసి పవన్ కల్యాణ్ ప్రజాధనంతో సినిమాలు, షూటింగులు అంటూ తిరుగుతన్నాడని వైసీపీ నేత రోజా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై జనసేన నాయకుడు, మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. జబర్దస్త్ లో రోజా పాల్గొనలేదా అని ప్రశ్నించారు. జబర్దస్త్ లో అనేక విన్యాసాలు చేసిన రోజాకు మాట్లాడేందుకు అర్హత ఉందా అని అడిగారు.
పర్యాటకమంత్రిగా రోజా ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పవన్ కల్యాణ్ అలసత్వం వహించలేదని అన్నారు. మీకు కబ్జాలు దొంగ వ్యాపారాలు ఉన్నాయని, పవన్ కల్యాణ్ కు సినిమాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయకుండా పవన్ కల్యాణ్ ను ఎలా విమర్శిస్తారని నిలదీశారు.
Next Story






