Ap: మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎస్కార్ట్ గన్‌మెన్ సస్పెన్షన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-14 06:41:35  IST  )

మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎస్కార్ట్ గన్‌మెన్‌పై సస్పెన్షన్ వేటు పడింది...

Ap: మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎస్కార్ట్ గన్‌మెన్ సస్పెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి గుమ్మడి సంధ్యారాణి(Minister Gummadi Sandhyarani) ఎస్కార్ట్ గన్‌మెన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విజయనగరం(Vizianagaram) ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న జీవీ రమణ.. కొద్దికాలంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్నారు. సాలూరు(Saluru)లోని మంత్రి నివాసానికి వెళ్లేందుకు జీవీ రమణ 30 తుపాకీ తూటాలు, పలు కీలక పత్రాలు ఉన్న బ్యాగ్‌తో విజయనగరం కలెక్టరే‌ట్ వద్ద బస్సు కోసం వేచి ఉన్నారు. బస్సు రావడంతో ఎక్కి మంత్రి ఇంటికి చేరుకున్నారు. అయితే తన వద్ద ఉన్న బ్యాగు మిస్సింగ్ అయినట్లు గమనించారు. బ్యాగ్ మిస్సయిన ప్రాంతాల్లో గాలించారు. కానీ ఫలితంలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బ్యాగు మిస్సయిన విషయం స్థానిక జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story