- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎవరైనా సరే అంటూ డీబీవీ స్వామి ఆగ్రహం.. సీరియస్ వార్నింగ్
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి డీబీవీ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Former Chief Minister Jagan Mohan Reddy)పై మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి(Minister Dola Sribala Veeranjaneyaswamy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి(Former Minister Peddireddy) అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో వైఎస్ జగన్(Ys Jagan) వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో జరిగిన అక్రమాలను తాము బయటపెడుతుంటే జగన్ ఉలిక్కిపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్న చందంగా జగన్ తీరు ఉందని సెటైర్లు వేశారు. పెద్ది అక్రమాల పుట్టపై మీడియాలో కూడా రాని పేర్లనూ బయటపెడుతున్నారని చెప్పారు. మాజీ సీఎం జగన్ అండ్, ఆయన టీమ్‌లో ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదని మంత్రి హెచ్చరించారు. జగన్‌కు అహంకారమని, అది తట్టుకోలేకే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. జగన్ మానసిక పరిస్థితి బాగా లేకే 2.0 అని అంటున్నారని విమర్శించారు. జగన్‌పై వైసీపీ నేతలకు నమ్మకం లేదని, అందుకే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్నారని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వ్యాఖ్యానించారు.






