ఏపీ పాలిటిక్స్‌లో అనూహ్య పరిణామం.. ఎన్నికల్లో భార్యభర్తలు ఓటమి..!

by Satheesh |

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నిక ఏదనేది తేడా లేకుండా

ఏపీ పాలిటిక్స్‌లో అనూహ్య పరిణామం.. ఎన్నికల్లో భార్యభర్తలు ఓటమి..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నిక ఏదనేది తేడా లేకుండా కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు భారీ విజయం దిశగా దూసుపోతున్నారు. ఏపీ రాజకీయ చరిత్రలోనే ఇప్పటి వరకు నమోదు కానీ భారీ విజయాన్ని ఎన్డీఏ కూటమి దక్కించుకోబోతోంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గానూ కూటమి 160 ప్లస్ సీట్లలో లీడింగ్‌లో ఉంది. అధికార వైసీపీ పార్టీ కళలో కూడా ఊహించని ఘోర ఓటమిని మూటగట్టుకోబోతుంది. ఆ పార్టీ కేవలం 5 స్థానాల్లో గెలిచి మరో 4 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతూ 10 సీట్లలోపే చాపచుట్టేసేలా కనిపిస్తోంది. వైసీపీలోని మెజార్టీ మంత్రులు, కీలక నేతలు అంతా ఓటమి పాలయ్యారు.

ఈ క్రమంలోనే ఏపీ పాలిటిక్స్‌లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ తరుఫున చీపురుపల్లి అసెంబ్లీ నుండి బరిలోకి దిగిన మంత్రి బొత్స, విశాఖ పార్లమెంట్ అభ్యర్థినిగా పోటీ చేసిన ఆయన సతీమణి బొత్స ఝాన్సీ ఇద్దరు తాము బరిలోకి దిగిన సీట్లలో కూటమి నేతల చేతుల్లో ఓటమి పాలయ్యారు. వైసీపీలో కీలక నేత, మంత్రి అయినా బొత్స సత్యానారాయణ, ఆయన సతీమణి ఝాన్సీ ఇద్దరు ఓడిపోవడం వైసీపీతో పాటు ఏపీ పాలిటిక్స్‌లోనూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Next Story