వెంకటేశ్ నాయుడు ఎవరో నాకు తెలియదు: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-04 13:59:35  IST  )

వెంకటేశ్ నాయుడు ఎవరో తనకు తెలియదని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు...

వెంకటేశ్ నాయుడు ఎవరో నాకు తెలియదు: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case) నిందితుడు వెంకటేశ్ నాయుడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. లిక్కర్ కేసులో ముడుపులు తరలించారనే ఆరోపణలు అంశం, సినీ, రాజకీయ ప్రముఖులతో దిగిన ఫొటోలు వైరల్ కావడం మరో సంచలనంగా మారింది. దీంతో లిక్కర్ కేసులో ఆయన ఫొటోలు దిగిన వాళ్లకు కూడా సంబంధాలున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే టీడీపీ నేతలతో దిగిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో తాజాగా దర్శనమిచ్చాయి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులతోనూ వెంకటేశ్ నాయుడు దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcongress Party) నాయకులతో పాటు పలు పార్టీలకు సంబంధించిన నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి(Minister Bc Janardhan Reddy) స్పందించారు. అమరావతి(Amaravati)లో మీడియాతో మాట్లాడిన ఆయన వెంకటేశ్ నాయుడు తనకు తెలియదన్నారు. ఏదో సందర్భంలో టీడీపీ నేతలతో ఫొటో దిగి ఉండొచ్చన్నారు. ఫొటో సమస్య కాదని.. నోట్ల కట్టలతో దొరకడం సమస్య అని చెప్పారు. జగన్‌ కేబినెట్‌లోని వాళ్లంతా జైలులో ఉన్నారని మంత్రి జనార్ధన్‌రెడ్డి విమర్శించారు.

Next Story