- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్లోఅవుట్ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు పర్యవేక్షణ
గ్యాస్ లీకై చెలరేగిన మంటలు సాయంత్రానికి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.

దిశ, వెబ్ డెస్క్ : కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ పైప్ లైను బ్లోఅవుట్ పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చె్న్నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుంటున్నారు. నివారణ చర్యలు ఫలించి మంటలు ఎగజిమ్మడం తగ్గుముఖం పట్టాయని మంత్రికి తెలియజేశారు. ఈ విషయమై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగిందన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ మంటలను ఆర్పడంతో పాటు గ్యాస్ లీకేజీ నిలువరించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అంతేకాకుండా గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలించడం తక్షణమే ప్రారంభించామన్నారు. వారికి కావాల్సన ఆహార పదార్థాలు, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం అన్నారు. వృద్ధులు, గర్భిణులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. దిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందంతో కలిసి స్థానిక అధికారులు పని చేస్తున్నారని తెలిపారు. పరస్పర సహకారంతో ఉష్ణోగ్రతలు తగ్గిస్తున్నారని.. మంటలను అదుపులోకి తెస్తున్నారని వివరించారు. సాయంత్రం కల్లా మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. అవసరమైన చోట్ల అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఉండి పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించాలని ఇప్పటికే సూచించామని వెల్లడించారు. గ్రామస్తులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు.






