- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలో రాష్ట్రానికి కుంకీ ఏనుగులు.. తొలి బ్యాచ్ ఆపరేషన్ ఆ జిల్లాలోనే..?
ఏపీకి కుంకీ ఏనుగులు రాకపై మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పలుచోట్ల ఏనుగుల బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. స్థానిక అడవుల నుంచి సమీప ప్రాంతాల్లో ఉన్న పంటలను నాశనం చేస్తున్నాయి. కొన్ని చోట్ల జనావాసాల్లోకి వెళ్లి దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకు చెందిన ట్రౌన్డ్ కుంకీ ఏనుగుల(Kunki Elephant)ను రాష్ట్రానికి తీసుకురావాలనే డిమాండ్ వినిపించింది. కుంకీ ఏనుగులను రాష్ట్రానికి తీసుకొస్తామని, అటు కర్ణాటక ప్రభుత్వం(Karnataka Government)తో కూడా చర్చించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) తెలిపారు.
అయితే పార్వతీపురం మన్యం జిల్లా(Parvatipuram Manyam District)లో జరిగిన అధికారులతో సమీక్ష నేపథ్యంలో కుంకీ ఏనుగుల రాకపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జనవరి 26కల్లా కుంకీ ఏనుగులను రాష్ట్రానికి తీసుకొస్తామని మంత్రి అచ్చెన్న పేర్కొన్నారు. ఈలోపు కుంకీ ఏనుగులకు కావాల్సిన సౌకర్యాలను సిద్ధం చేస్తామని తెలిపారు. తొలి బ్యాచ్‌లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని అడుగుతామని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) పేర్కొన్నారు.






