- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అది అసలు పార్టీనే కాదు: వైసీపీపై మంత్రి అచ్చెన్న ఫైర్
ప్రతిపక్ష హోదా అడుగుతున్న వైసీపీపై మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు కురిపించారు...

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాలు(Assembly Sesstions) గురువారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) రాకపోవడంపై ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల(Assembly Sesstions)కు రాకపోవడానికి ప్రతిపక్ష హోదా లేకపోవడమేనని తెలుస్తోంది. దీంతో వైసీపీ(Ycp) నేతలపై అధికార పార్టీ నాయకులు విమర్శలు కురిపిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రజలే ఇవ్వలేదని ప్రభుత్వం ఎలా ఇస్తుందని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తామనేది అసలు అది పార్టీనే కాదని విమర్శించారు. హోదా అడిగే వాళ్లు నాయకుడే కాదన్నారు. హోదా కావాలని అడిగే వాళ్ల చెంపలు చెళ్లుమనిపించాలని మంత్రి అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు.






