- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బొత్స కన్నీళ్లు పెట్టుకోవడం పెద్ద డ్రామా: మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్
by Vemula.Srinu Prasad |
వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కన్నీళ్లు పెట్టుకోవడం పెద్ద డ్రామా అని మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి వెనుక జగన్ మోహన్ రెడ్డి హస్తం ఉందనే అనుమానాన్ని గతంలో బొత్సనే చెప్పారని అచ్చెన్న చేసిన కామెంట్స్‌పై మనస్థాపం చెంది ఆయన భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే....

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కన్నీళ్లు పెట్టుకోవడం పెద్ద డ్రామా అని మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Ys Rajasekhar Reddy) మృతి వెనుక జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) హస్తం ఉందనే అనుమానాన్ని గతంలో బొత్సనే చెప్పారని అచ్చెన్న చేసిన కామెంట్స్‌పై మనస్థాపం చెంది ఆయన భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. అయితే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బొత్స చేసిన ఆరోపణలపై అచ్చె్న్న స్పందించారు. నిజం నిప్పులాంటిదని.. కన్నీళ్లతో దానిని ఆర్పలేరని చెప్పారు. నాడు వైఎస్ మరణంపై జగన్‌ను వేలెత్తి చూపిన బొత్స.. నేడు రాజకీయ లబ్ధి కోసం బురద జల్లే రాజకీయం అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం పెద్ద డ్రామా అని అచ్చెన్న కొట్టిపారేశారు.
Next Story






