- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కేసులో ఎవరైనా ఒక్కటే.. చర్యలు తప్పవు: మంత్రి ఆనం
క్వార్జ్ తవ్వకాల కేసులో నిందితులపై చర్యలు తప్పవని మంత్రి ఆనం హెచ్చరించారు..

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో జరిగిన క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు. మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడిని మంగళవారం అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చిన సమాచారంతో త్వరలో అనిల్ కుమార్ యాదవ్‌ను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని ఆరోపిస్తున్నారు. తమపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము కక్షపూరిత రాజకీయాలు చేయమన్నారు. మైనింగ్ కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు. చట్టం ముందు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అని ఉండదని, తప్పు చేసినవారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ రాజకీయ ఉనికిని కోల్పోయిందని మంత్రి ఆనం విమర్శించారు.






