- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివేకా గొడ్డలివేటుపై జగన్నాటకాలు : అవినాష్‌పై మంత్రి అనగాని ఫైర్
వివేకా హత్యకేసులో త్వరలోనే తీర్పు వస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సొంత బాబాయ్ హత్యకేసులో జగన్ ఆడుతున్న నాటకాలన్నీ ప్రజలకు తెలుసని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వివేకా గొడ్డలివేటుపై జగన్నాటకాలు పేరుతో ఆయన వీడియో విడుదల చేశారు. చెల్లెలి బాధపై స్పందించాల్సింది పోయి.. అవినాష్ రెడ్డితో ప్రెస్ మీట్ పెట్టించి ఆమెపై ఆరోపణలు చేయించడాన్ని తప్పుపట్టారు. నిందితులే ఇతరులపై నిందలేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వివేకానంద హత్యకేసులో నిజానిజాలను దాచేందుకు వైఎస్సార్సీపీ తపిస్తోందని, బాబాయ్ ను చంపిన వారిని కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని అనగాని ఆరోపించారు.
ఐదేళ్ల కాలంపాటు జగన్ సీఎంగా ఉన్నప్పుడే వివేకా హత్యకేసులో వాస్తవాలను ఏమార్చారని దుయ్యబట్టారు. అధికారం పోయాక తమ బలప్రదర్శన చేస్తున్నారే తప్ప ప్రజలపై ప్రేమ లేదన్నాు. జగన్ చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మకుండా.. వాళ్లను 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. వివేకా హత్యపై జగన్, అవినాష్ రెడ్డి వ్యాఖ్యల వీడియోలను ఆయన ఈ సందర్భంగా ప్రదర్శించారు. వివేకానంద చాలా మంచి వ్యక్తి అని చెప్పి.. మళ్లీ వాళ్లే తిట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ హత్యకేసులో త్వరలోనే తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని, ఇంట్లో ఉన్న మహిళలకు అండగా ఉండాలని జగన్‌ను కోరుతున్నామని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రం బాగుండాలన్న తపనతో పనిచేస్తుంటే.. ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడాన్ని మంత్రి తప్పుపట్టారు.






