- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీలుగా మార్చాం
ఈ ఏడాది మహిళ, శిశు సంక్షేమ శాఖల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామనిమంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఈ ఏడాది మహిళ, శిశు సంక్షేమ శాఖల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Gummidi Sandhya Rani) అన్నారు. అందులో భాగంగా మినీ అంగన్వాడీలను (Anganwadi) ప్రధాన అంగన్వాడీలుగా మార్చాం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 5వేల మినీ అంగన్వాడీలను అప్ గ్రేడ్ చేశామన్నారు. అంతేకాకుండా అంగన్వాడీలకు సెల్ ఫోన్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చామన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు మెరుగైన సేవలు అందించడానికి పాత 4జీ ఫోన్ల స్థానంలో 5జీ స్మార్ట్ ఫోన్లను కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు. తద్వారా క్షేత్ర స్థాయి నివేదికలు వేగవంతమవుతాయని, గర్భిణిలు, తల్లులు, పిల్లలకు సేవలు సమర్థవంతంగా అందుతాయని వివరించారు.
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో (Tribal Areas) డోలీ మోతలు లేకుండా రహదారుల సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. తద్వారా గర్భిణులు, అనారోగ్యంతో బాధపడే వారు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఇబ్బందులను తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతవాసులు సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. అందులో భాగంగా గిరిజన రైతుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఐటీడీఏలకు రూ.13.70 కోట్ల నిధులను విడుదల చేశామన్నారు.
9 ఐటీడీఏల పరిధిలో ట్రైకార్ రుణాలను పునరుద్ధించామన్నారు. గిరిజన రైతులకు 90 శాతం భారీ సబ్సిడీతో ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, ట్రక్కులు, ఆయిల్ ఇంజిన్లు, టార్పాలిన్లు పంపిణీ చేయనున్నామని ప్రకటించారు. అంతేకాకుండా పశుపోషణ ద్వారా అదనపు ఆదాయం కల్పించేందుకు గోకులాలు మంజూరు చేస్తున్నా కీలక నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రానున్న 2026లో మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని ప్రకటించారు.






