- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై సెలవుల్లో కూడా
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పదవ తరగతి విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ ప్రకటించింది. 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మార్చి వరకు సెలవు రోజుల్లో కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని తెలియజేసింది. సెలవు రోజుల్లో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే టెన్త్ విద్యార్థులకు రోజు వారీ మెనూ ప్రకారం మిడ్ డే మీల్స్ అందించాలని అధికారులను ఆదేశించారు విద్యాశాఖ అధికారులు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు దృష్టిలో పెట్టుకొని ప్రతినెలా రెండవ శనివారం, ఆదివారం ప్రత్యేక క్లాసులకు హాజరవుతుంటారు. అయితే వారు లంచ్ లో ఆకలితో ఉండి మరీ క్లాసులు వినాల్సి వస్తుందని ఇటీవల పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో అధికారులు సీఎం చంద్రబాబు నాయుడికి నివేదించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






